ఢిల్లీలో అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
Add ap7am to your home Screen

ఢిల్లీలో అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ

CM Jagan meeting with Amit Shah concludes
  • ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
  • ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ
  • ఈ మధ్యాహ్నం అమిత్ షాతో సమావేశం
  • రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించిన సీఎం జగన్... ఈ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి కిందట ఈ భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన అంశాలను సీఎం జగన్ ఈ సమావేశంలో అమిత్ షా ఎదుట ప్రస్తావించారు. విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి సమర్పించినట్టుగానే, అమిత్ షాకు కూడా విజ్ఞాపన పత్రం అందజేసినట్టు తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన ముగియడంతో సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
Advertisement
Jagan
Amit Shah
Narendra Modi
New Delhi
YSRCP
Andhra Pradesh

More Telugu News