ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా?: వర్మ
- నవీన్ హత్యకేసుపై ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
- హరిహరకృష్ణ, నిహారిక ఫొటోలతో ట్వీట్
- వర్మ సినిమాలకు పర్ ఫెక్ట్ కథ అంటున్న నెటిజన్లు
నిహారికకు తనకు మధ్య అడ్డొస్తున్నాడనే కోపంతో హరిహరకృష్ణ తన స్నేహితుడు నవీన్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. ఆపై శరీరాన్ని చీల్చి, గుండె, మర్మాంగాలను కూడా కోసి బయటకు తీశాడు. డెడ్ బాడీ ఆనవాళ్లు గుర్తించకుండా మార్చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో హరిహరకృష్ణతో పాటు అతడికి సాయం చేసిన నిహారిక, స్నేహితుడు హసన్ లను పోలీసులు జైలుకు పంపారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.