వెనక్కు తగ్గని ఖవాజా.. 400 దాటిన ఆసీస్ స్కోరు
- శతకంతో సత్తా చాటిన కామెరూన్ గ్రీన్
- ఐదో వికెట్ కు ఖవాజా, గ్రీన్ 208 పరుగుల భాగస్వామ్యం
- వెంటవెంటనే మూడు వికెట్లు తీసిన అశ్విన్
ఎట్టకేలకు కీపర్ క్యాచ్ ద్వారా గ్రీన్ ను ఔట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో అలెక్స్ క్యారీ (0)ని డకౌట్ చేసిన అశ్విన్ కాసేపటికే స్టార్క్ (0)ను పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయింది. కానీ, టెయిలెండర్లతో కలిసి ఖవాజా స్కోరు 400 దాటించాడు. అతను డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.142 ఓవర్లకు ఆసీస్ 401/7 స్కోరుతో నిలిచింది. ఖవాజా 171 పరుగులతో ఉన్నాడు.