బ్రహ్మోస్... మళ్లీ సక్సెస్
- బ్రహ్మోస్ నావికాదళ వెర్షన్ ప్రయోగం విజయవంతం
- అరేబియా సముద్రంలో ఓ నౌక నుంచి ప్రయోగం
- బ్రహ్మోస్ కు సీకర్, బూస్టర్ అమర్చిన వైనం
- దేశీయంగా అభివృద్ధి చేసిన సీకర్, బూస్టర్ పనితీరు పరిశీలన
ఈ పరీక్షలో బ్రహ్మోస్ క్షిపణికి దేశీయంగా అభివృద్ధి చేసిన సీకర్, బూస్టర్ ను అమర్చారు. వీటి పనితీరును పరిశీలించారు. సీకర్, బూస్టర్ కలయికతో బ్రహ్మోస్ సత్తా మరింత పెరుగుతుందని నేవీ వర్గాలు తెలిపాయి. తాజా వెర్షన్ ను సముద్రతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేలా డిజైన్ చేశారు.