Advertisement

నాకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది: సుస్మితా సేన్

sushmita sen reveals she survived a big heart attack
  • ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో సుస్మితా సేన్ సంచలన ప్రకటన
  • గుండెపోటు వస్తే స్టెంట్ వేశారని వెల్లడి
  • ఇప్పుడు తాను క్షేమంగానే ఉన్నానంటూ అభిమానులకు భరోసా
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇటీవల నెట్టింట చేసిన ఓ ప్రకటన తీవ్ర కలకలానికి దారి తీసింది. తనకు గుండెపోటు వచ్చిందని సుస్మితా సేన్ వెల్లడించడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఇన్‌స్టా వేదికగా జరిగిన లైవ్ సెషన్‌లో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. 

‘‘నాకు గుండెపోటు వచ్చింది. అది చాలా తీవ్రమైనది. ప్రధాన రక్తనాళంలో 95 శాతం మూసుకుపోయింది. యాంజియో ప్లాస్టీ చేశారు. స్టెంట్ వేశారు. నా జీవితంలో అది ఒక దశ. ఇప్పుడది గడిచిపోయింది. కానీ.. నేనేమీ భయపడలేదు’’ అని ఆమె లైవ్ సెషన్‌లో పేర్కొన్నారు. వైద్యులే తన ప్రాణాలు కాపాడారంటూ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు.. సుస్మిత క్షేమంగా ఉండాలంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు పెద్ద ఎత్తున పుష్ఫ గుచ్ఛాలు పంపించారు. దీంతో తన ఇల్లు ఓ పూలతోటలా మారిదంటూ సుస్మిత వ్యాఖ్యానించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. 

సుస్మిత నటించిన ఆర్య-3 వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చీకటి ప్రపంచం నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు పోరాడే తల్లిగా సుస్మిత నటించారు.
Advertisement
Sushmita Sen

More Telugu News