మరోమారు ఓడిన కరాచీ కింగ్స్.. డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లపై అరిచేసిన వాసిమ్ అక్రమ్.. వీడియో ఇదిగో!
- 8 మ్యాచుల్లో ఆరుసార్లు ఓడిన కరాచీ కింగ్స్
- 202 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ఇస్లామాబాద్ యునైటెడ్
- వరుస ఓటములను జీర్ణించుకోలేకపోయిన అక్రమ్
- ఆటగాళ్లపై మండిపాటు
8 మ్యాచ్‌లు ఆడిన కరాచీ కింగ్స్‌కు ఇది ఆరో ఓటమి. వరుస పరాజయాలతో కోపం మీదున్న ఆ జట్టు ప్రెసిడెంట్ వాసిం అక్రమ్ ఆటగాళ్ల మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లపై విరుచుకుపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటగాళ్లతో అక్రమ్ పౌరుషంగా మాట్లాడుతుండడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అక్కడే కూర్చున్న షోయబ్ మాలిక్ బదులివ్వడం కూడా కనిపించింది.