నా భర్తను హింసించారు: పట్టాభి భార్య చందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భర్తను హింసించారు: పట్టాభి భార్య చందన

Pattabhirams wife Chandana spoke to media
  • తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో పట్టాభిని ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి కొట్టారన్న చందన
  • పోలీసుల సహకారంతోనే ఇదంతా జరిగిందని ఆరోపణ
  • తన భర్తకు ఏమైనా  జరిగితే డీజీపీ ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక 
పోలీస్ స్టేషన్ లోనే టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను హింసించారని ఆయన సతీమణి చందన ఆరోపించారు. తోట్లవల్లూరు స్టేషన్ లో తన భర్తను ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి కొట్టారని చెప్పారు. పోలీసులను అందరనీ బయటికి పంపించి ఈ దాడి చేశారని అన్నారు. దీనికి డీజీపీ ఏం చెప్తారని నిలదీశారు. తన భర్తకు ఏమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

ఈ రోజు తన నివాసంలో మీడియాతో పట్టాభి సతీమణి చందన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసుల సహకారంతోనే తన భర్తపై దాడి జరిగిందని, హింసించారని అన్నారు. ‘‘సేఫ్ గా తీసుకెళ్తామని చెప్పి జీప్ ఎక్కించుకుని, పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. ఏదైనా ఇంజక్షన్ ద్వారా కూడా చేయొచ్చు ఇప్పుడు, చాలా టెక్నాలజీ  వచ్చేసింది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. 

‘‘నా భర్తకు ప్రాణహాని ఉందని ముందు నుంచీ మొత్తుకుంటున్నా. ఇప్పుడు కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కు తరలిస్తామని చెబుతారు. అక్కడ రిమాండ్ లో ఏమైనా చేస్తే ఎవరిది బాధ్యత’’ అని ప్రశ్నించారు. తన భర్తకు ఏమైనా జరిగితే ఊరుకోబోమని, డీజీపీ ఆఫీసు ముందు ఆత్మహత్యమ చేసుకుంటానని చందన హెచ్చరించారు.


Advertisement
Pattabhi
Chandana
gannavaram TDP office
AP DGP
Pattabhirams wife Chandana

More Telugu News