గన్నవరం ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన చంద్రబాబు
- గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి
- కారుకు నిప్పంటించిన వైనం
- జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమన్న చంద్రబాబు
- పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని ఆగ్రహం
"రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు ధ్వజమెత్తారు.