విజయవాడ దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం విరాళం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం విరాళం

Vijayawada Kanaka Durga Temple receives gold crown worth 75 lakh rupees
  • శ్రీకాకుళం జిల్లాకు చెందిన భక్తుడు దుర్గా శ్రీనివాస్ సమర్పణ
  • 494 గ్రాముల బంగారంతో నవరత్నాలతో కిరీటం తయారీ
  • దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ ఈ కానుక అందజేత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ భారీ కానుక అందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ భక్తుడు సుమారు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి విరాళంగా సమర్పించారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడైన కె. దుర్గా శ్రీనివాస్ ఈ కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. 494 గ్రాముల స్వచ్ఛమైన బంగారంతో రూపొందించిన ఈ కిరీటంలో ఎరుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల నవరత్నాలను పొదిగారు.

దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గా శ్రీనివాస్ ఈ కిరీటాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనానాయక్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ కానుకను సమర్పించానని, పవిత్రమైన నవరాత్రుల సమయంలో కిరీటాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక పూజలు, దర్శనాల నడుమ ఈ విరాళం అందడం విశేషం.
Advertisement
Kanaka Durga Temple
Vijayawada Indrakeeladri
Dasara Navaratri
Gold crown donation
Durga Srinivas Srikakulam
Vijayawada temple news

More Telugu News