25 రోజులను పూర్తిచేసుకున్న 'వాల్తేరు వీరయ్య'
- జనవరి 13వ తేదీన వచ్చిన 'వాల్తేరు వీరయ్య'
- నేటితో 25 రోజుల ప్రదర్శన పూర్తి
- మెగా మూవీకి ఇంతవరకూ లేని పోటీ
- మరిన్ని వసూళ్లను రాబట్టే ఛాన్స్
ఈ రోజుతో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. చాలా సెంటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సరికొత్త పోస్టర్ ను వదిలారు. సంక్రాంతి తరువాత చాలానే సినిమాలు వచ్చినప్పటికీ, 'వాల్తేరు వీరయ్య'కి పోటీగా నిలిచే స్థాయి సినిమాలు రాలేదు.
అందువలన ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే వెళుతోంది. ఈ నెల 17వ తేదీన 'శాకుంతలం' విడుదల కానుంది. అప్పటివరకూ కూడా వీరయ్య హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి తరహా మాస్ మార్క్ .. దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పచ్చు.