ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం.... బులెటిన్ విడుదల చేసిన నారాయణ హృదయాలయ
- నిన్న కుప్పంలో గుండెపోటుకు గురైన తారకరత్న
- కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స
- గతరాత్రి బెంగళూరు తరలింపు
- నారాయణ హృదయాలయలో కొనసాగుతున్న చికిత్స
పూర్తిగా వైద్యసాయంపైనే ఆయన ఆధారపడి ఉన్నారని, రానున్న రోజుల్లోనూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నిశిత పరిశీలన, చికిత్స కొనసాగుతాయని వివరించారు. ఈ సమయంలో తారకరత్నను సందర్శించేందుకు ఎవరూ రావొద్దని, చికిత్సకు ఆటంకం కలిగించవద్దని నారాయణ హృదయాలయ బులెటిన్ లో విజ్ఞప్తి చేసింది.