మోదీ పర్యటనలో సెక్యూరిటీ వైఫల్యం.. ప్రధాని దగ్గరకు వెళ్లిన వ్యక్తి.. వీడియో ఇదిగో

Security breach in Modi road show
  • హుబ్బళీలో ప్రధాని మోదీ రోడ్ షో
  • మోదీకి పూలమాల వేయడానికి యత్నించిన యువకుడు
  • పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది
ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. హుబ్బళీలో మోదీ రోడ్ షో నిర్వహిస్తుండగా రోడ్డు పక్కనున్న బ్యారికేడ్లను దూకిన ఒక వ్యక్తి మోదీ కాన్వాయ్ వద్దకు పరిగెత్తాడు. మోదీకి పూలదండ వేయడానికి ప్రయత్నించాడు. ప్రధానికి దాదాపు ఒక అడుగు దూరం వరకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మోదీ తన వాహనం ఫుట్ బోర్డుపై ఉండి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఈ హఠాత్తు ఘటనతో ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. అయితే అతని వద్ద నుంచి మోదీ పూలదండను తీసుకుని కారు బ్యానెట్ పై ఉంచారు. మరోవైపు అతడిని భద్రతా సిబ్బంది పక్కకు తీసుకెళ్లారు.
Go Back to Shorts
Narendra Modi
BJP
Security Breach

More Telugu News