హైదరాబాదులో చలపతిరావు సంస్మరణ సభ... నివాళులు అర్పించిన బాలకృష్ణ
- డిసెంబరు 24న చలపతిరావు కన్నుమూత
- కడసారి వీడ్కోలుకు రాలేకపోయిన బాలకృష్ణ
- వీరసింహారెడ్డి చిత్రీకరణలో ఉన్న వైనం
- నేడు చలపతిరావు కుమారుడు రవిబాబుకు పరామర్శ
గత నెల 24న చలపతిరావు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో బాలయ్య వీరసింహారెడ్డి చిత్రీకరణలో ఉన్నారు. దాంతో ఆయన చలపతిరావుకు కడసారి వీడ్కోలు పలికేందుకు రాలేకపోవడం పట్ల చాలా బాధపడ్డారు.
నటుడు చలపతిరావుకు ఎన్టీఆర్ కు మధ్య ఆత్మీయ అనుబంధం ఉండేది. చలపతిరావు ఆ అనురాగాన్నే బాలకృష్ణపైనా చూపించేవారు. బాలయ్యతో కలిసి చలపతిరావు అనేక చిత్రాల్లో నటించారు.