నానా పటేకర్ మృతి ఘటనలో ట్విస్ట్.. ‘అసహజ మరణం’గా కేసు నమోదు
- నానా పటేకర్ మృతిపై గోవా పోలీసుల కేసు
- బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద నమోదు
- కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు తీసుకోనున్న పోలీసులు
- పోస్టుమార్టం నివేదికను పరిశీలించనున్న పోలీసులు
- సహజ మరణంగా తేలితే కేసు కొట్టివేసే అవకాశం
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా అసహజ మరణం (అన్‌నేచురల్ డెత్) కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 194 కింద ఈ కేసు నమోదైంది. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.
గోవాలోని డోనా పౌలా ప్రాంతంలో ఉన్న తన నివాసం నుంచి నానా పటేకర్‌ను మణిపాల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు పంచనామా నిర్వహించనున్నారు. గోవా మెడికల్ కాలేజీలో నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను పరిశీలించడంతో పాటు, నానా పటేకర్ కుటుంబ సభ్యులు, ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. ఆయన మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
నానా పటేకర్ మరణం సహజంగా సంభవించినట్లు తేలితే కేసును మూసివేసే అవకాశం ఉంది. ఒకవేళ అనుమానాస్పద పరిస్థితులు లేదా ఇతరుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభిస్తే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మణిపాల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శేఖర్ సల్గావ్కర్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. నానా పటేకర్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే మరణించారని చెప్పారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ మందులు వాడుతున్నట్లు తమకు తెలిసిందని వెల్లడించారు.
గురువారం తెల్లవారుజామున నానా పటేకర్‌కు గుండెపోటు రావడంతో మరణించారు. ఆసుపత్రిలో వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఉదయం 5.20 గంటలకు ఆయన మరణించినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
1951 జనవరి 1న జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. ఆయన తండ్రి గజానన్ పటేకర్ వస్త్రాలపై చిత్రాలు వేసే కళాకారుడిగా, వ్యాపారిగా పనిచేశారు. నానా పటేకర్ 28 ఏళ్ల వయసులో ఉండగా తండ్రి మరణించారు. ఆయన తల్లి నిర్మలా పటేకర్ 2019 జనవరి 29న 99 ఏళ్ల వయసులో కన్నుమూశారు.