'బాబీ' సినిమాతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాం!: హాస్యనటుడు లక్ష్మీపతి కూతురు శ్వేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాబీ' సినిమాతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడ్డాం!: హాస్యనటుడు లక్ష్మీపతి కూతురు శ్వేత

Swetha Lakshmipathi Interview
  • కమెడియన్ గా గుర్తుండిపోయిన లక్ష్మీపతి 
  • రచయితగా ఆయన కూతురు శ్వేత
  • తండ్రి జ్ఞాపకాలతో 'పోస్టు చేయని ఉత్తరాలు' పుస్తకం 
  • 'బాబీ' ఫ్లాప్ తమని ఇబ్బందులు పెట్టిందని వ్యాఖ్య   
కమెడియన్ లక్ష్మీపతి ఇప్పుడు లేరు. కానీ ఆయన చేసిన పాత్రలు మాత్రం ప్రేక్షకులకు తప్పకుండా గుర్తుంటాయి. 'వర్షం' డైరెక్టర్ శోభన్ కి ఆయన స్వయాన అన్నయ్య. శోభన్ చనిపోయిన కొంతకాలానికే లక్ష్మీపతి కూడా చనిపోయారు. లక్ష్మీపతి కూతురు శ్వేత తన తండ్రితో తనకి గల అనుబంధాన్ని 'పోస్టు చేయని ఉత్తరాలు' అనే పుస్తకంగా తీసుకొచ్చారు. రీసెంట్ గా ఆమె ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో శ్వేత మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా నాకు రాయడం అంటే ఇష్టం. ఆ ఇష్టంలో నుంచి పుట్టిందే ఈ పుస్తకం. మా బాబాయ్ మహేశ్ బాబుతో 'బాబీ' సినిమాను తీశారు. ఆ సినిమా క్లైమాక్స్ ఆడియన్స్ కి నచ్చకపోవడం వలన ఫ్లాప్ అయింది. దాంతో లాస్ వచ్చింది. ఆ ఎఫెక్ట్ బాబాయ్ కెరియర్ పై పడింది. దాంతో ఆర్ధికంగా అందరం ఇబ్బందులు పడ్డాము" అని అన్నారు. 

"అప్పుడే మాకున్న థియేటర్లతో పాటు మిగతా ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో బాబాయ్ తీసిన 'వర్షం' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ తరువాత రవితేజతో చేసిన 'చంటి' దెబ్బకొట్టేసింది. నాన్న చేసిన సినిమాల్లో 'ఆంధ్రుడు' .. 'పెదబాబు' సినిమాలు ఇష్టం" అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
Lakshmipathi
Swetha
Tollywood

More Telugu News