చండూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తాం... మునుగోడులో కేటీఆర్ ప్రకటన
- మునుగోడు అభివృద్ధిపై సమీక్షించిన కేటీఆర్
- ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడి
- సంస్థాన్ నారాయణపూర్ లో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటన
చండూరును త్వరలోనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మునుగోడులో త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. చండూరు మునిసిపాలిటీకి రూ.50 కోట్లు, చౌటుప్పల్ మునిసిపాలిటీకి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో కొత్తగా 5 సబ్ స్టేషన్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. సంస్థాన్ నారాయణపూర్ లో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.