Balakrishna: బాలకృష్ణ సినిమా షూటింగ్ డేట్ చెప్పిన అనిల్ రావిపూడి!

Anil Ravipudi Interview
షార్ట్స్‌లో చూడండి
అనిల్ రావిపూడి తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఫ్లాప్ కి దొరక్కుండా ముందుకు వెళుతున్నాడు. ఆరంభంలో యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన, ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోలతో చేస్తూ వెళుతున్నాడు. తాజాగా ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, తన నెక్స్ట్ సినిమాను గురించి ప్రస్తావించాడు. 

"బాలకృష్ణగారి 108వ సినిమాను నేను డైరెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. కెరియర్ పరంగా చూసుకుంటే బాలకృష్ణగారికి ఉన్న క్రేజ్ వేరు .. నా మార్కు వేరు .. ఇద్దరిదీ చెరో దారి. అందువలన ఈ కాంబినేషన్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది" అన్నాడు.

"నేను కూడా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. బాలకృష్ణగారిని ఎమోషన్ తో కూడిన యాక్షన్ లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాగే ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఆయన పాత్ర కామెడీ చేయదు. కానీ కొన్ని సందర్భాలు నవ్వు తెప్పిస్తుంటాయి. అలా ఆయన స్టైల్ తో పాటు నా మార్కు మిస్ కాకుండా చూశాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Balakrishna
Anil Ravipudi
Tollywood

More Telugu News