Dhanush: 'సార్' రిలీజ్ డేట్ ఖరారు .. న్యూ పోస్టర్ రిలీజ్!

Sir Movie Update
షార్ట్స్‌లో చూడండి
ధనుశ్ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఒక ఇమేజ్ చట్రంలో చిక్కుకోకుండా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'సార్' .. తమిళంలో 'వాతి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. 

తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ, కొత్త పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో లెక్చరర్ పాత్ర పోషిస్తున్నప్పటికీ ధనుశ్ యాక్షన్ సీన్ లోనే కనిపిస్తుస్తుండడాన్ని పోస్టర్ లో చూడొచ్చు. విద్యా వ్యవస్థలోని సంస్కరణల దిశగా ఈ కథ ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అందులోని లోపాలను సరిచేసే క్రమంలోనే ఈ లెక్చరర్ యాక్షన్ లోకి దిగుతాడన్న మాట. 

ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతవరకూ ఆయన నుంచి ప్రేమకథా చిత్రాలే వచ్చాయి. కానీ మొదటిసారిగా ఆయన తన స్టైల్ కి భిన్నమైన కథను తీసుకుని వస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. సితార బ్యానర్ తో పాటు త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Go Back to Shorts
Dhanush
Samyukta Menon
Venky Atluri
SIR Movie

More Telugu News