ఉగ్రవాదమే మా ప్రధాన సమస్య: పాక్ ప్రధాని
- పోలీస్ వ్యాన్ పై ఉగ్రదాడిని ఖండించిన షెహబాజ్ షరీఫ్
- మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని
- ఉగ్రదాడిపై విచారణకు ఆదేశించిన ఖైబర్ ఫక్తుంఖ్వా ముఖ్యమంత్రి
ఖైబర్ ఫక్తుంఖ్వాలోని లాకీ మార్వాత్ లో ఓ పోలీస్ వ్యాన్ పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పోలీస్ వ్యాన్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫక్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు.