కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్న సింగర్ సునీత

Singer Sunitha son becoming Tollywood hero
  • సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సునీత
  • తన కొడుకు ఆకాశ్ ను హీరోగా పరిచయం చేస్తున్నట్టు సునీత ప్రకటన
  • అందరూ ఆశీర్వదించాలని విన్నపం
తెలుగు సినీ పరిశ్రమలో సింగర్ సునీతది ఒక ప్రత్యేకమైన స్థానం. ప్రజలను పారవశ్యానికి గురి చేసే తన వాయిస్ తో ఎన్నో అద్భుతమైన పాటలను ఆమె పాడారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆమె ఎంతో బిజీగా ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. తన కొడుకు ఆకాశ్ ను సునీత హీరో గా పరిచయం చేయబోతున్నారనే వార్త కొంత కాలంగా వినిపిస్తోంది. దీనిపై ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆకాశ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. తన కొడుకు సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్తున్నాడని... అతన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. అయితే ఏ సినిమా చేయబోతున్నాడు? దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్? తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Singer Sunitha
Son
Aakash
Hero
Tollywood

More Telugu News