Brahmanandam: 'ఆహా' కోసం హోస్టుగా రంగంలోకి దిగుతున్న బ్రహ్మానందం?

 Brahmanandam will do a Talk Show in Aha
షార్ట్స్‌లో చూడండి
అల్లు అరవింద్ ఈ మధ్య కాలంలో 'ఆహా' ఓటీటీ సంస్థపైనే పూర్తి దృష్టిపెట్టారు. ఈ ఫ్లాట్ ఫామ్ కి కావలసిన కొత్త కంటెంట్ కోసం ఆయన అనేక రకాల కాన్సెప్టులను పరిశీలిస్తున్నారు. ఓటీటీ సినిమాలు .. వెబ్ సిరీస్ లపైనే కాకుండా, టాక్ షోలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. బాలకృష్ణను వ్యాఖ్యాతగా పెట్టి 'అన్ స్టాపబుల్' టాక్ షోను ఎనౌన్స్ చేసినప్పుడు అంతా కూడా ఆశ్చర్యపోయారు. అందుకు కారణం అప్పటివరకూ బాలయ్య అలాంటి షోలు చేయకపోవడమే. 

'అన్ స్టాపబుల్' విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని, ఇప్పుడు సెకండ్ సీజన్ లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మరో టాక్ షోను డిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ టాక్ షోకి వ్యాఖ్యాతగా బ్రహ్మానందం అయితే కరెక్టుగా ఉంటుందనేది ఆయన ఆలోచన. ఆల్రెడీ బ్రహ్మానందాన్ని కలిసి కాన్సెప్టును గురించిన చర్చలు జరిపారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 

తెరపైనే కాదు బయట కూడా బ్రహ్మానందం చమత్కారినే. కామెడీతో కూడిన టాక్ షోను ఆయన గొప్పగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలంగా ఆయన సినిమాల సంఖ్యనే తగ్గించారు. అలాంటి ఆయన టాక్ షో చేయడానికి ఒప్పుకుంటారా? అనేదే డౌటు. చూడాలి మరి ఏం జరుగుతుందో.  

Go Back to Shorts
Brahmanandam
Allu Aravind
Aha Talk Show

More Telugu News