టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి అరెస్ట్
- ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలు
- తెల్లవారుజామున ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
- నోటీసులు ఇచ్చి టీడీపీ నేతను అరెస్ట్ చేసిన వైనం
- అయ్యన్న కుమారుడు రాజేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇటీవల అయ్యన్న ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో అయ్యన్న ఫోర్జరీ పత్రాలు సమర్పించారన్న అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు. ఏలూరు కోర్టులో ఆయనను హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.
