ఆకలి సూచీలో మరింత దిగజారిన భారత్
- గతేడాదితో పోలిస్తే ఆరు స్థానాలు దిగువకు
- 121 దేశాల అంతర్జాతీయ సూచీలో 107వ స్థానం
- చిన్నారుల్లో పోషకాల లోపం, ఎదుగుదల లేపోవడం కారణాలు
దక్షిణాసియా దేశాల్లో అప్ఘానిస్థాన్ మినహా మిగిలిన అన్ని దేశాలు ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉండడం గమనించాలి. పాకిస్థాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 74వ ర్యాంకుల్లో నిలిచాయి. భారత్ కంటే దిగువన ఉన్నవి జాంబియా, అప్ఘనిస్థాన్, టిమోర్ లెస్టే, గయానా బిసా, సియెర్రా లియోన్, లెసోతో తదితర దేశాలున్నాయి.