3 గంటల్లోనే 11 లక్షల వ్యూస్... దూసుకుపోతున్న బాలయ్య, చంద్రబాబు 'అన్‌స్టాపబుల్ 2' ప్రోమో
- 'అన్‌స్టాపబుల్ 2' తొలి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసిన 'ఆహా'
- ఈ ఎపిసోడ్‌కు అతిథులుగా హాజరైన చంద్రబాబు, నారా లోకేశ్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రోమో వీడియో
సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్‌గా మారింది. కేవలం 170 నిమిషాల్లో (దాదాపుగా 3 గంటలు) ఈ వీడియోకు ఏకంగా 11 లక్షల వ్యూస్ వచ్చాయి. టీడీపీకి ఎదురైన క్లిష్ట పరిస్థితులతో పాటు చంద్రబాబు జీవితంలో చోటుచేసుకున్న సరదా ఘటనలు, బాలయ్య వెల్లడించిన ఆసక్తికర అంశాలు, తన రాజకీయ ప్రస్థానంపై లోకేశ్ చేసిన కామెంట్లతో కూడిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.