Adi Saikumar: 'క్రేజీ ఫెలో' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు!

Crazy Fellow Movie Pre Release Event Date Confirmed
షార్ట్స్‌లో చూడండి
ఆది సాయికుమార్ హిట్ అనే మాట విని చాలా కాలమే అయింది. అయినా తనవంతు ప్రయత్నంగా వరుస సినిమాలు చేస్తూనే వెళుతున్నాడు. తన స్థాయికి తగినట్టుగా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూనే ఉన్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'క్రేజీ ఫెలో'. కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, ఫణికృష్ణ దర్శకత్వం వహించాడు. టైటిల్ ను బట్టే ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 

ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ను ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అందుకు హైదరాబాదులోని 'దసపల్లా కన్వెన్షన్' వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో ఆది సాయికుమార్ జోడీగా దిగంగాన సూర్యవన్షి అలరించనుంది. 'హిప్పీ' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలో మరో కథానాయికగా 'మిర్నా' తెలుగు తెరకి పరిచయం కానుంది. విభిన్నమైన ప్రేమకథాంశంతో పలకరించనున్న ఈ సినిమాతోనైనా ఆది సాయికుమార్ హిట్ కొడతాడేమో చూడాలి.
Go Back to Shorts
Adi Saikumar
Digangana
Mirnaa
Crazy Fellow Movie

More Telugu News