మునుగోడు ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తాం: జగదీశ్ రెడ్డి
- మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది
- బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెపుతారు
- కేసీఆర్ ను ఓడించడం ఎవరి వల్ల కాదు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి దేశ ప్రజలందరూ చర్చించుకుంటున్నారని జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఉన్న పథకాలను తమకు కూడా అందించాలని ప్రధాని మోదీని అడుగుతున్నారని తెలిపారు. సరికొత్త అభివృద్ధి నమూనాతో వస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిన్నటి కేసీఆర్ సమావేశాన్ని చూసిన తర్వాత మోదీ అమిత్ షాలకు నిద్రపట్టలేదని... అందుకే ఈరోజు మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.