ఎఫ్ఎన్‌సీసీ ఎన్నికల్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గెలుపు.. ఆర్భాటంగా బరిలోకి దిగి ఓడిన బండ్ల గణేశ్
- ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
- ఉపాధ్యక్ష పదవి కోసం పోటీ పడిన బండ్ల గణేశ్
- తుమ్మల రంగారావు చేతిలో ఓటమి
- అల్లు అరవింద్, సురేశ్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్ విజయం
రెండేళ్లకోసారి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ఎఫ్ఎన్‌సీసీలో మొత్తం 4,600 మంది సభ్యులుండగా, అందులో 1,900 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. నిన్నటి ఎన్నికల్లో అల్లు అరవింద్, సురేశ్ బాబు, కేఎల్ నారాయణ ప్యానల్ సభ్యులు విజయం సాధించారు. కార్యదర్శిగా ముళ్లపూడి మోహన్, ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు, కోశాధికారిగా రాజశేఖర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వీవీఎస్ఎస్ పెద్దిరాజు ఎన్నికయ్యారు. ఏడిద రాజా, ఇంద్రపాల్‌రెడ్డి, వడ్లపట్ల మోహన్, సీహెచ్ వర ప్రసాదరావు, శైలజ, కాజా సూర్యనారాయణ, దర్శకుడు మురళీమోహన్, బాలరాజు, గోపాలరావు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.