కొనసాగుతున్న కలెక్షన్ల వర్షం.. రూ. 400 కోట్లకు చేరువైన ‘బ్రహ్మాస్త్ర’

Brahmastra box office witnesses huge jump in numbers
షార్ట్స్‌లో చూడండి
రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (తెలుగులో బ్రహ్మాస్త్రం). బ్రహ్మాండమైన విజయం సాధించింది.  ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్ లో చేరేందుకు చేరువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ కంపెనీ తెలిపింది. దేశీయంగా రూ.250 కోట్లు వసూళ్లు చేసిందని చెప్పింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9న తేదీన విడులైంది. బాయ్ కాట్ సెగను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర నిలిచింది.

 తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా హిందీలో మాత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ‘బ్రహ్మాస్త్ర’ దియేటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. మూడు వారాల తర్వాత కూడా థియేటర్లు 85 శాతం నిండుతున్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటించారు. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు. కాగా, రూ. 410 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం మూడు భాగాలుగా వస్తుందని చిత్రం బృందం తెలిపింది. రెండో పార్టును 2025లో విడుదల చేయాలని చూస్తున్నారు.
Go Back to Shorts
Brahmastra
Bollywood
collections
400cr
mark

More Telugu News