గ్రాండ్ అలయెన్స్ దిశగా అడుగులు.. ఆరేళ్ల తర్వాత సోనియాను కలుస్తున్న నితీశ్ కుమార్
- కాంగ్రెస్ నేతృత్వంలో మహా కూటమి ఏర్పడే అవకాశం
- ఆదివారం సాయంత్రం సోనియాతో భేటీ కానున్న నితీశ్, లాలూ
- రాహుల్ కూడా భేటీకి హాజరైతే బాగుంటుందని భావిస్తున్న బీహార్ నేతలు
మరోవైపు, ఎల్లుండి జరగబోయే సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరైతే బాగుంటుందని ఈ ఇద్దరు బీహార్ నేతలు భావిస్తున్నారు. అయితే, భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు రాహుల్ గాంధీని నితీశ్ కలిశారు. అయితే, ఆ సమయంలో వైద్య చికిత్స నిమిత్తం సోనియాగాంధీ విదేశాల్లో ఉన్నారు. మరోవైపు.. సోనియా, నితీశ్, లాలూల భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.