Prabhakar: మా అబ్బాయి హీరో .. మూడు సినిమాలతో ఎంట్రీ: బుల్లితెర ప్రభాకర్

Prabhakar Interview
షార్ట్స్‌లో చూడండి
బుల్లితెరపై నటుడిగా ప్రభాకర్ కి మంచి పేరు ఉంది. సీరియల్స్ కి నిర్మాతగా .. చిన్న సినిమాల దర్శకుడిగా ఆయనకి  అనుభవం ఉంది. ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై ఆయన కనిపించడం తగ్గింది. దర్శకత్వం పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అలాంటి ప్రభాకర్ తన తనయుడు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. 

తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాకర్ మాట్లాడుతూ .. "హీరో కావాలనేది మా అబ్బాయి కల. డిగ్రీ పూర్తిచేయగానే యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాడు. ఈ జనరేషన్ పిల్లలు అవకాశాల కోసం వెళ్లి .. వెయిటింగులో ఉండే పరిస్థితి లేదు. దాంతో తానే యూ ట్యూబ్ కోసం ఓ కవర్ సాంగ్ చేశాడు. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నాడు. 

నా స్నేహితులతో కలిసి నేనే మా వాడితో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ ఈ లోగా 3 సినిమాలలో చేసే ఛాన్స్ వచ్చింది. రెండు సినిమాలు ఆల్రెడీ పూర్తయ్యాయి .. ఒక సినిమా వచ్చేనెలలో మొదలవుతుంది. మా అబ్బాయి కోసం వచ్చే కథలు వింటూ వెళుతున్నాను. తనతో నేను చేయాలనుకున్న సినిమాను జనవరిలో మొదలుపెడతాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Prabhakar

More Telugu News