వినాయక నిమజ్జనం వేళ... కొత్త రికార్డులు నెలకొల్పిన హైదరాబాద్ మెట్రో రైల్
- నిన్న ఒక్క రోజే మెట్రోలో ప్రయాణించిన వారు 4 లక్షల మంది
- గణేశ్ శోభాయాత్ర సందర్భంగా రాత్రి 2 దాకా నడిచిన మెట్రో సేవలు
- ఖైరతాబాద్ స్టేషన్‌లో 40 వేల మంది మెట్రో దిగగా, 22 వేల మంది ఎక్కినట్లు అధికారుల వెల్లడి
శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మెట్రోలో ఏకంగా 4 లక్షల మంది ప్రయాణించినట్లుగా అధికారులు చెప్పారు. మియాపూర్- ఎల్బీ నగర్ కారిడార్‌లో 2.46 లక్షల మంది ప్రయాణించగా... నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో 1.49 లక్షల మంది ప్రయాణించారు. జేబీఎస్- ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్రయాణించారు. ఇక ఆయా స్టేషన్లలో ప్రయాణికుల వివరాల్లోకెళితే... అత్యధికంగా 22 వేల మంది ఖైరతాబాద్ స్టేషన్‌లో రైలు ఎక్కితే... 44 వేల మంది ఆ స్టేషన్‌లో రైలు దిగారు.