అమ్మ గుర్తుకొచ్చిందంటూ కంటతడి పెట్టుకున్న నాగార్జున

Nagarjuna gets emotional watching Oke Oka Jeevitham movie
  • రేపు విడుదలవుతున్న 'ఒకే ఒక జీవితం' సినిమా
  • సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ ఏర్పాటు  
  • సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదన్న నాగార్జున
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అక్కినేని అమల ప్రధాన పాత్రలను పోషించిన 'ఒకే ఒక జీవితం' సినిమా రేపు (9న) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల కోసం ఈ సినిమా ప్రీమియర్ ఏర్పాటు చేశారు.

 నాగార్జున, అమల, శర్వానంద్, అక్కినేని అఖిల్ తదితరులు సినిమాను వీక్షించారు. సినిమా చూసి థియేటర్ లోనే నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపు తనకు కన్నీళ్లు ఆగలేదని నాగ్ అన్నారు. మా అమ్మ, ఆమె చూపించిన ప్రేమ గుర్తుకొచ్చాయని చెప్పారు. చాలా భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. 

తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను చూస్తే ఎవరైనా కంటతడి పెట్టుకుంటారని చెప్పారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఘనవిజయం అందుకోవాలని ఆకాంక్షించారు. దాదాపు పదేళ్ల తర్వాత పూర్తి నిడివి పాత్రలో అమల నటించారు. అమల, శర్వానంద్ తల్లీకొడుకుల పాత్రలను పోషించారు. రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Go Back to Shorts
Nagarjuna
Amala
Akkineni Akhil
Sharvanand
Oke Oka Jeevitham Movie

More Telugu News