6వ తేదీన రెడ్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ల విడుదల
- దేశీయంగా తయారైన ఏ1 ఫోన్ విడుదల అదేరోజు
- తక్కువ ధరకే విడుదలకు అవకాశం
- రెడ్ మీ ప్రైమ్ 11 5జీ సహా పలు ఫోన్ల పరిచయం
రెడ్ మీ ప్రైమ్ 11 5జీ ఫోన్ ను సైతం షావోమీ అదే రోజు విడుదల చేయనుందని తెలుస్తోంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ వోసీ చిప్ సెట్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా ఉంటుంది. ఇందులో 6.58 అంగుళాల డిస్ ప్లే, 90 హెర్జ్ రిఫ్రెష్ రేటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.