ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కడ్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భారత 14వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ధన్ కడ్
- రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం
- హాజరైన రామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు
ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ధన్ కడ్ విపక్షాలు మద్దతు పలికిన మార్గరెట్ అల్వాను ఓడించారు. ధన్ కడ్ కు 74.36 శాతం ఓట్లు వచ్చాయి. 1997 నుంచి జరిగిన చివరి ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.
ఇక ధన్ కడ్ కు ఏన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం విశేషం. వీటిలో నవీన్ పట్నాయక్ కు చెందిన బిజూ జనతాదళ్, వైసీపీ, మాయావతికి చెందిన బీఎస్పీ తదితర పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్ కు దూరంగా ఉంది.