దేశంలో నిలకడగా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 16,299 కేసుల నమోదు
- దేశ వ్యాప్తంగా 53 మంది మృతి
- 1,25,076కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.58 శాతంగా, క్రియాశీల రేటు 0.28 శాతంగా, రికవరీ రేటు 98.53 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,07,29,46,593 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 25,75,389 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.