ముఖేశ్ అంబానీ, సుందర్ పిచాయ్ లతో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి.. ఎక్కడో తెలుసా?

Ravi Shastri Watches Cricket Game With Mukesh Ambani and Sundar Pichai
  • ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మ్యాచ్ చూసిన దిగ్గజాలు
  • హండ్రెడ్ కాంపిటీషన్ మ్యాచ్ ను వీక్షించిన అంబానీ, పిచాయ్
  • స్కై స్పోర్ట్స్ తరపున కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న శాస్త్రి
రియలన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లు తమ కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. అయితే, వీరిద్దరూ కొంత వెసులుబాటు కల్పించుకుని క్రికెట్ మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. లండన్ లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ చూశారు. 

హండ్రెడ్ కాంపిటీషన్ సెకండ్ ఎడిషన్ గేమ్స్ ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లకు సంబంధించి స్కై స్పోర్ట్స్ తరపున టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురూ కలుసుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు. ఈ ఫొటోను రవి శాస్త్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

'ఆగస్ట్ మాసంలో క్రికెట్ పుట్టినింట్లో (లండన్) క్రికెట్ ని ఇష్టపడే ఇద్దరు వ్యక్తుల కంపెనీలో' అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Ravi Shastri
Mukesh Ambani
Sundar Pichai
Cricket
London
Lords

More Telugu News