రష్యన్ అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి.. అక్కడ వార్, ఇక్కడ ప్యార్! పెళ్లి వీడియో ఇదిగో..
- ఓవైపు ఉప్పూ, నిప్పులా రష్యా, ఉక్రెయిన్..
- ఇండియాలో వివాహం చేసుకున్న ఆ దేశాల వధూవరులు
- హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో వివాహం
- హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగిన తీరు
ఇక్కడి వాళ్లే సొంత వారై..
రష్యాకు చెందిన సెర్జెయ్ నొవికోవ్, ఉక్రెయిన్ కు చెందిన ఎలోనా బ్రమొకా ఇద్దరూ ఉద్యోగాల నిమిత్తం కొన్నాళ్లు ఇజ్రాయెల్ లో ఉన్నారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇటీవలే వారు హిమాచల్‌ప్రదేశ్ లోని ధర్మశాలకు వచ్చారు. కొంతకాలం నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్థానికులు ధర్మశాలకు సమీపంలోని ఖరోటా దివ్య ఆశ్రమంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఈ వివాహానికి వధూవరుల విదేశీ స్నేహితులు కూడా హాజరై ఆశీర్వదించారు.