కామన్వెల్త్ క్రీడల్లో నేడు భారత్, పాకిస్థాన్ మహిళల మ్యాచ్... వర్షం కారణంగా ఓవర్లు కుదింపు
- బర్మింగ్ హామ్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- రెండో ఓవర్లోనే తొలి వికెట్ డౌన్
- పాక్ ఓపెనర్ ను డకౌట్ చేసిన మేఘనా సింగ్
ప్రస్తుతం పాక్ మహిళల జట్టు 4 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. ఓపెనర్ మునీబా అలీ (4 బ్యాటింగ్), కెప్టెన్ బిస్మా మారూఫ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఇరుజట్లకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే, ఈ గ్రూప్ లో తన తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోగా, పాక్ జట్టును బార్బడోస్ జట్టు ఓడించింది. దాంతో నేటి మ్యాచ్ లో గెలుపు ఇరుజట్లకు కీలకంగా మారింది.