Andhra Pradesh: రేపు ఏపీలోని ఆరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

Meteorological department predicts moderate rains in several districts of AP tomorrow
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా మిగతా చోట్ల అక్కడక్కడా స్వల్పంగా వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ శుక్రవారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Rains
APSDMA
AP

More Telugu News