బహిరంగ ప్రదేశాల్లో తుపాకులు కలిగి ఉండే హక్కు ప్రజలకు ఉంది: అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అమెరికాలో ఇటీవల పలు రాష్ట్రాల్లో తుపాకి కాల్పులు
- తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా చట్టం తీసుకొచ్చే పనిలో బైడెన్ సర్కారు
- పౌరులు బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం వారి హక్కు అన్న కోర్టు
- 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించిన కోర్టు
6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పౌరులు తమ వెంట తుపాకులు తీసుకెళ్లొచ్చని, వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకి కలిగి ఉండడం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా న్యూయార్క్ గతంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బైడెన్ సర్కారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.