ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. ప్రొఫెసర్‌పై తల్లిదండ్రుల సంచలన ఆరోపణలు
- కుల వివక్ష గురించి ముందే చెప్పాడు అన్న సాహిల్ తండ్రి
- ‘‘భరించమని చెప్పా’’ అంటూ తండ్రి ఆవేదన
- ప్రొఫెసర్ సూర్యనారాయణపై కుటుంబం తీవ్ర ఆరోపణలు
- ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులో ఎఫ్‌ఐఆర్
- కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్
- సూర్యనారాయణను డీన్ బాధ్యతల నుంచి తప్పించిన ఐఐటీ
‘‘నా కొడుకు కుల వివక్ష గురించి ముందే చెప్పాడు. ఐఐటీలో సీటు రావడం చాలా కష్టం.. భరించమని చెప్పా’’.. ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే తండ్రి రవీంద్ర వాకోడే చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్ 18న హాస్టల్ గదిలో సాహిల్ మృతిచెందిన ఘటనపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుండగా.. తన కొడుకును ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా కులం పేరుతో వేధించేవారని తండ్రి ఆరోపించారు. ప్రొఫెసర్‌ను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబం డిమాండ్ చేస్తోంది.
‘‘సూర్యనారాయణ నా కొడుకుపై కుల వివక్ష చూపేవాడు. ఈ విషయం సాహిల్ గతంలోనే మాకు చెప్పాడు. కానీ ఐఐటీలో సీటు సాధించడం ఎంత కష్టమో తెలుసు కాబట్టి భరించమని చెప్పా’’ అని రవీంద్ర తెలిపారు. ‘‘మేం తల్లిదండ్రులుగా మా బిడ్డకు మానసికంగా అండగా నిలిచాం. అదే మా తప్పా?’’ అని సాహిల్ తల్లి సోనాలి వాకోడే ప్రశ్నించారు. ప్రొఫెసర్ సూర్యనారాయణతో పాటు ఐఐటీ బాంబే డైరెక్టర్ షిరీష్ కేదారేపైనా కుటుంబం ఆరోపణలు చేసింది. కేదారే మాత్రం కుల వివక్ష ఆరోపణలను ఖండించారు.
సాహిల్ మరణంపై అతడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోవై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 108తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని నిబంధనలను కూడా కేసులో చేర్చారు. ప్రొఫెసర్ సూర్యనారాయణతో పాటు మరికొందరి పేర్లు ఫిర్యాదులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసును ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఆరోపణలపై పూర్తి విచారణ తర్వాతే వాస్తవాలు తేలాల్సి ఉంది.
సాహిల్ పరీక్షలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ పట్టుబడ్డాడని ఐఐటీ బాంబే తొలుత వెల్లడించింది. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలోకి పంపి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని కూడా పేర్కొంది. అయితే తర్వాత ఆ ప్రకటనపై సంస్థ క్షమాపణ చెప్పింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు ఇంకా దర్యాప్తులో ఉన్నందున ముందుగానే వాటిని నిర్ధారించడం సరికాదని స్పష్టం చేసింది.
పరీక్ష సమయంలో సాహిల్ ఇన్విజిలేటర్‌గా ప్రొఫెసర్ సూర్యనారాయణ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబం ఆయనపై ఆరోపణలు చేసింది. మరోవైపు ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం సదరు ప్రొఫెసర్‌కు మద్దతుగా నిలిచింది. ఆయన్ను డీన్ (అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్) బాధ్యతల నుంచి తప్పించినా, విద్యార్థులు మాత్రం అది సరిపోదని చెబుతున్నారు. ఆయనను ప్రొఫెసర్ పదవి నుంచి కూడా తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘‘నా కొడుకు చాలా ప్రతిభావంతుడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సీటు సాధించడం సాధారణ విషయం కాదు. ఇప్పుడు రకరకాల ఆరోపణలు చేసి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చు. నిందితులను అరెస్టు చేయడమే మా డిమాండ్’’ అని రవీంద్ర వాకోడే అన్నారు. సాహిల్ కుటుంబం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కూడా కోరుతోంది.
సాహిల్ మృతితో ఐఐటీ బాంబే క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు, విద్యార్థుల భద్రత, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో మార్పులు సహా 18 డిమాండ్లను విద్యార్థులు సంస్థ ముందుంచారు. ఈ కేసులో కుల వివక్ష, వేధింపుల ఆరోపణలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి.