గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
- సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన సల్మాన్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఓ మొక్కను నాటిన వైనం
- తన అభిమానులు కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపు
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన అభిమానులకు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే దిశగా పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నానని సల్మాన్ పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేసే క్రమంలో తన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.