వంట గ్యాస్ పై ఇక సబ్సిడీ లేదు... సిలిండర్ ధరను వినియోగదారుడే పూర్తిగా భరించాలి!
- వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక నిర్ణయం
- ఇకపై సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయం
- ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీ పరిమితం
- దేశంలో రూ.1000 దాటిన సిలిండర్ ధర
అయితే, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ పై రాయితీ ఎత్తివేసిన నేపథ్యంలో, సామాన్యుడికి ఇది శరాఘాతం వంటి నిర్ణయమే అని చెప్పాలి. ఇప్పటికే దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటింది. ఇప్పుడు ప్రభుత్వం రాయితీ తొలగించిన నేపథ్యంలో, వినియోగదారుడిపైనే పూర్తి భారం పడనుంది.