కేంద్ర మంత్రులకు టీడీపీ ఎంపీల లేఖలు... సీబీఐ బృందానికి భద్రత కల్పించాలని వినతి
- అమిత్ షా, జితేంద్ర సింగ్‌లకు ఎంపీల లేఖలు
- నారాయణ అరెస్ట్‌లో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న ఎంపీలు
- ఈ వ్యవహారంలో చిత్తూరు ఎస్పీ పాత్ర అనుమానాస్పదమని ఆరోపణ
- సీబీఐ బృందానికి బెదిరింపుల అంశాన్ని ప్రస్తావించిన టీడీపీ ఎంపీలు
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆ లేఖల్లో టీడీపీ ఎంపీలు ప్రస్తావించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందానికి బెదిరింపుల అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌లో పోలీసులు నిబంధనలు పాటించలేదన్న టీడీపీ ఎంపీలు... ఈ వ్యవహారంలో చిత్తూరు జిల్లా ఎస్పీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు.