పేపర్ లీక్ ఆందోళనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కీలక వ్యాఖ్యలు!
- యువతకు ఆదేశాలు కాదు.. చర్చ అవసరమని భగవత్ వ్యాఖ్య
- నేటి తరం ప్రతి విషయాన్నీ ప్రశ్నిస్తోందని వెల్లడి
- కారణాలు వివరించి నమ్మకం కల్పించాలని సూచన
- యువతతో ప్రేమగా, ఓపిగ్గా మాట్లాడాలని పిలుపు
- డిక్టేషన్ కాదు.. డిస్కషన్ కావాలని స్పష్టీకరణ
దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యువత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి తరం ప్రశ్నించే తరం అని, వారికి ఆదేశాలు ఇవ్వడం కంటే చర్చించి అర్థం చెప్పడం అవసరమని అన్నారు.
ఢిల్లీలో నిర్వహించిన ‘సమకాలీన మాతృత్వం’ అంశంపై జాతీయ అవగాహన సమావేశంలో భాగవత్ మాట్లాడారు. తమ చిన్నతనంలో పెద్దలు చెప్పిన మాట వినేవాళ్లమని చెప్పారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. నేటి యువత ప్రతి విషయాన్నీ ప్రశ్నిస్తోందని, అందుకే వారికి కారణాలు వివరించి నమ్మకం కల్పించాలని చెప్పారు.
యువతతో ఎక్కువ సమయం గడపాలని, వారిపై ప్రేమ, ఆప్యాయత చూపాలని సూచించారు. ‘‘డిక్టేషన్ కాదు.. డిస్కషన్ కావాలి. ఆదేశాలు కాదు.. పరస్పర అంగీకారం ముఖ్యం’’ అంటూ యువతతో సంభాషణే సరైన మార్గమని స్పష్టం చేశారు.
భగవత్ తన ప్రసంగంలో జంతర్‌మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసనలను నేరుగా ప్రస్తావించలేదు. అయితే దేశంలో పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే సమయంలో సీజేపీ ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు కూడా కొనసాగుతున్నాయి.