'సౌత్ ఇండియా షాపింగ్ మాల్' సహా మూడు మాల్స్ కు బాంబు బెదిరింపులు
- 3 షాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపులు
- రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టిన పోలీసులు
- ఆకతాయి పనిగానే నిర్ధారణ
- పోలీసుల అదుపులో నిందితుడు
బాంబు బెదిరింపుల వార్తలతో మూడు షాపింగ్ మాల్స్‌లో డాగ్ స్క్వాడ్‌లతో పోలీసులు సోదాలు చేపట్టారు. దాదాపుగా రెండు గంటలకు పైగా తనిఖీలు చేసినా ఎలాంటి బాంబులు కనిపించలేదు. దీంతో ఈ బెదిరింపులు ఆకతాయిల పనేనని పోలీసులు తేల్చారు. ఆ తర్వాత నిందితుడి చేసిన ఫోన్ ఆధారంగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.