Chandrababu: అత్యాచారానికి గురైన‌ యువ‌తిని ప‌రామ‌ర్శించ‌డానికి విజ‌య‌వాడ ఆసుప‌త్రికి చేరుకున్న చంద్ర‌బాబు

chandra babu reaches hospital
షార్ట్స్‌లో చూడండి
విజయవాడ ప్రభుత్వ ఆసుప‌త్రిలో అత్యాచారానికి గురైన యువతిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు ఆ హాస్పిటల్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆయ‌న‌ను పోలీసులు బాధిత‌ యువ‌తి వ‌ద్ద‌కు తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు, విజయవాడ ప్రభుత్వ ఆసుప‌త్రి వద్ద ఉద్రిక్తత నెల‌కొంది. 

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను అక్క‌డున్న టీడీపీ మహిళా నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతాన‌ని వాసిరెడ్డి చెప్పారు. చివ‌ర‌కు ఆమెను పోలీసులు బాధితురాలి వ‌ద్ద‌కు తీసుకు వెళ్లారు. దీంతో టీడీపీ మ‌హిళా నేతలు ఆసుప‌త్రి ద్వారం వద్దే బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News