Nara Lokesh: ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తోన్న యువ‌తికి 'వైసీపీ' స‌ర్పంచ్‌ ఫోనులో బెదిరింపులు: నారా లోకేశ్

lokesh slams ycp
షార్ట్స్‌లో చూడండి
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ యువ‌తిపై స‌ర్పంచ్ చేష్ట‌ల గురించి ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 

''వైఎస్ జ‌గ‌న్ పాలనలో గజానికో వైసీపీ గాంధారి కొడుకు పుట్టుకొచ్చి మహిళల్ని వేధిస్తున్నాడు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లి గ్రామంలో వైసీపీ సర్పంచ్ కన్నం శ్యామ్ బరితెగించి... ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ఫోన్లో వేధించాడు.

ఆమెకు అండగా నిలిచిన స్నేహితుడు సుదర్శన్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడేలా పోలీసులతో కలిసి బెదిరించాడు. వైసీపీ నాయకులే మహిళల పట్ల కాలయముల్లా మారి కాటేస్తున్నారు. గన్ కంటే ముందొస్తానంటూ సినిమా డైలాగ్స్ కొట్టిన జగన్ రెడ్డి గారు ఎక్కడ?  

యువతిని వేధించి ఆమె స్నేహితుడు ఆత్మహత్యకు కారణమైన సర్పంచ్, అతని అనుచరులు, ఈ దారుణానికి సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని లోకేశ్ డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News