కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి సేవలో కేసీఆర్ దంపతులు
- ఉదయం కొల్హాపూర్ వెళ్లిన కేసీఆర్ దంపతులు
- అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన వైనం
- కేసీఆర్ వెంట సంతోష్ కుమార్, శ్రావణ్ కుమార్
సీఎం కేసీఆర్ దంపతులకు అమ్మవారి ఆలయం అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన కేసీఆర్ దంపతులు కార్వీర్ నివాసిని శ్రీ అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో పాల్గొన్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ దంపతుల వెంట టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్, రావుల శ్రావణ్ కుమార్, తదితరులు ఉన్నారు.