India: ఇండియాలో 1500కు దిగొచ్చిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India logs 1581 corona new cases
షార్ట్స్‌లో చూడండి

భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. ప్రజలంతా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకున్న క్రమంలో మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 5.68 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... వీరిలో 1,581 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఇదే సమయంలో 2,741 మంది కరోనా నుంచి కోలుకోగా... 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 23,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.74 శాతానికి పెరగగా... క్రియాశీల రేటు 0.06 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది కరోనా బారిన పడగా... 4.24 కోట్ల మంది కోలుకున్నారు. మొత్తం 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 181 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News